గ్రామాల అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం
చింతపల్లి మార్చ్ 12, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని దేన్య తండా, బోత్య తండా, బాలాజీ తండా, చింతపల్లి, ధైర్యపురి తండాలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ నిధులతో 10.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంఖు స్థాపన చేసారు.
చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామం నుండి మల్లపురాజుపల్లి వరకు 4కోట్ల 75లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు చింతపల్లి మండలంలోని బాలాజీ తండా, చింతపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. తదనంతరం చింతపల్లి మండల పరిధిలోని శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ మాత దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి, మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలపడాలని ఆయన అన్నారు.
గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ భవనం ద్వారా మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన రాకపోకలు కల్పించేందుకు బీటి మరియు రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పేదోడి గుండెల్లో సంతోషం నింపుతాం. ఇందిరమ్మ ఆశయాలతో నడుస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలనే లక్ష్యంతో,రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4.5 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నాం. ఇది కేవలం ఇళ్ల నిర్మాణం కాదు.. పేదవాడి సొంతింటి కల సాకారం.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


