IPL-2026 : త్రినేత్రం న్యూస్ : Mar 11, 2026, ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ప్రకటించారు. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
కాగా ఈ నెల 28న తొలి మ్యాచ్ బెంగళూరులో రా.7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ మధ్య జరగనుంది. మ్యాచ్‌ల వివరాలను పైన ఫొటోలలో చూడవచ్చు.


