Distribution of Exam Kits : శారదానికేతన్ పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ

TRINETHRAM NEWS

అరకులోయ మార్చి 11, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలోని శారదానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రామిస్ లాండ్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది విద్యార్థులకు ప్లాంకులు, పెన్నులు, స్కేలు వంటి పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా అల్లూరి జిల్లా మహిళా సంఘం ఐద్వా ఉపాధ్యక్షురాలు వి. జయ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు. ఈ సమయంలో ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
ప్రామిస్ లాండ్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు దీసరి దేముడమ్మ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ తమ సంస్థ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రామిస్ లాండ్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు దీసరి దేముడమ్మ, ట్రెజరర్ కుమార్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు జయ, పాఠశాల ప్రిన్సిపాల్ చిరంజీవులు, అప్పలరాజు, బుద్దురాజు, సిపిఎం మండల కార్యదర్శి రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of exam kits to class 10 students

You cannot copy content of this page

Scroll to Top