గుంటూరు జిల్లా : అమరావతి: మార్చి 10: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర కేంద్రమైన అమరావతి అభివృద్ధి తెలుగు వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
సచివాలయంలో జరిగిన సి ఆర్ డి ఏ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. భూ కేటాయింపులు, సహా వివిధ ప్రతిపాదనలకు దాని ఆమోదన లభించిందని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆయన తెలిపారు.
అదేవిధంగా క్రీడలు, పర్యాటక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ , అమరావతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


