Brahmotsavams : శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు.

TRINETHRAM NEWS

చింత పల్లి మార్చ్ 08, త్రినేత్రం న్యూస్. చింతపల్లి. మండలంలోని గోడుకొండ్ల, వెంకటేశ్వర నగర్ (మాల్) గ్రామంలో నిర్వహించిన శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని,శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నిర్వహించారు.

శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు దేవరకొండ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, స్వామి దయా కరుణా కటాక్షాలతో దేవరకొండ శాంతి, సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు .
గ్రామ నాయకులు, వేద పండితులు అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Alivelu Manga Padmavati Sametha Venkateswara Swamy

You cannot copy content of this page

Scroll to Top