Dr. Satthi : కొప్పవరంలో సత్తెమ్మ తల్లి ఆశీస్సులు పొందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు శనివారం అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఉన్న శ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు శ్రీమతి ఆదిలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తాడి వెంకట రామకృష్ణారెడ్డి, సూరారెడ్డి, ఉప సర్పంచ్ మల్లిడి వీర్రాఘవ రెడ్డి, అనపర్తి మండల వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గొలుగూరి దుర్గారెడ్డి, మల్లిడి ఆదిరెడ్డి, పోతంశెట్టి ఆదిరెడ్డి, కొవ్వూరి దుర్గారెడ్డి, కె.వి., కర్రి సాయి రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dr. Satthi Suryanarayana Reddy receives blessings

You cannot copy content of this page

Scroll to Top