మార్చి 8న ఎమ్మెల్యేలకు వినతి పత్రాల అందజేత
దేవరకొండ ఇన్చార్జి :- ఇరుగ దిండ్ల కృష్ణ.
దేవరకొండ డివిజన్ మార్చ్ 07, త్రినేత్రం న్యూస్. వడ్డెర కులస్తుల ఆత్మగౌరవం మరియు హక్కుల సాధన కోసం తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఆయుల మల్లు పిలుపు మేరకు ఈ నెల 8వ తేదీ (ఆదివారం) ఉదయం 9 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు దేవరకొండ వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉద్యమం కేవలం ఒక కార్యక్రమం కాదని, దశాబ్దాలుగా వడ్డెర జాతి ఎదుర్కొంటున్న నిర్లక్ష్యానికి, అన్యాయానికి వ్యతిరేకంగా సాగుతున్న చైతన్యపు ప్రతిఘటన అని పేర్కొన్నారు.గత 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వడ్డెర కార్పొరేషన్ అంశాన్ని ప్రజా ఎజెండాగా మార్చి, దానిని సాధించుకోవడమే ఈ ఉద్యమప్రధానఉద్దేశ్యం.
వడ్డెర కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు కేటాయించాలని, ఇది తమ హక్కు అని ఆయన స్పష్టంచేశారు. వడ్డెర్లఆర్థికాభివృద్ధి, విద్య మరియు ఉపాధి హక్కులను వ్యవస్థీకృతంగా సాధించేందుకు ఈ కార్పొరేషన్ ఒక బలమైన సాధనంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణంలో వడ్డెర కులస్తులు కీలక భాగస్వాములుగాఉన్నప్పటికీ, వనరుల పంపిణీలో మాత్రం ఎప్పుడూ అన్యాయానికి గురవుతున్నారని ఇరగదిండ్ల కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
మన ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులకు మన సమస్యలను వివరించి, రాజకీయ వేదికల ద్వారా మన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ చారిత్రాత్మక ఉద్యమంలో దేవరకొండనియోజకవర్గంలోని వడ్డెర కులబాంధవులందరూ అధిక సంఖ్యలోపాల్గొని, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


