Beti Bachao Beti Padao : డిండి మండలకేంద్రంలో బేటి బచావో బేటిపడావో కార్యక్రమం.

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి). మార్చ్ 06, త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీ మీటింగ్ కు ముఖ్య అతిథిగా సీ పీ డీ ఓ చంద్రకళ బాల్య వివాహాలు గురించి, బేటి బచావో బేటి పడావో కార్యక్రమం గురించి వివరించారు.

ప్రతి ఆడబిడ్డ చదువుల తల్లి ఇంటికి వెలుగు , శిశువిక్రయాలు జరగకుండా ఆడపిల్ల అనే చులకన భావంతో చూడకుండా మనందరం కలిసికట్టుగా మండల స్థాయి గ్రామస్థాయి ఆడపిల్లల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని వివరించారు అన్ని గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని సెక్రటరీలకు చెప్పినారు అన్ని శాఖల సమన్వయంతో గ్రామాభివృద్ధి లకు గ్రామంలో ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రాం లో ఐసిడిఎస్ సూపర్వైజర్లు రేణుక రమణ అనిత , ఎం పీ ఓ, ఏ పీ ఓ, శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి, పోలీసు శాఖ వారు,మండల సమైక్య అధ్యక్షురాలు అనిత, అంగన్వాడీ టీచర్లు పంచాయతీ సెక్రటరీలు పాల్గొనడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Beti Bachao Beti Padao Program

You cannot copy content of this page

Scroll to Top