Shiva Parvathi Kalyanam : అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం

TRINETHRAM NEWS

శివ పార్వతుల కళ్యాణం విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
ఉలపాల స్వప్న శేఖర్ రెడ్డి -తీదేడు గ్రామ సర్పంచ్.

చింతపల్లి మార్చ్ 06, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరు శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గుట్ట పైన నిర్వాహకులు అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆమె అన్నారు.ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని అన్నారు.ఈ గుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివుడు,భవానీల కూడిన ప్రసిద్ధ శైవ క్షేత్రం అన్నారు.శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం విజయవంతం చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, గ్రామ పాలక వర్గం,గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shiva Parvathi Kalyanam in grandeur

You cannot copy content of this page

Scroll to Top