Strict Action : కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :మార్చ్ 5: నెల్లూరు జిల్లా: జలదంకి .. జూద కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన..* జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా జలదంకి మండల పరిధిలో కోడి పందాలు, గుండాట, పేకాట వంటి అక్రమ జూద కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జలదంకి ఎస్‌ఐ సయ్యద్ లతీ ఫున్నిసా జూదరులను హెచ్చరించారు..
అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టరీత్యా నేరమని, నిర్వహించే వారితో పాటు ప్రోత్సహించే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం చోడవరం, రామవరప్పాడు, కేశవరం పంచాయతీల పరిధిలోని శివారు ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించే ప్రాంతాలను తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.
జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు కావలి డీ.ఎస్పీ శ్రీధర్, కలిగిరి సీ.ఐ వెంకట నారాయణ నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు, మండలంలోని 17 పంచాయతీలలో ఎక్కడైనా కోడి పందాలు లేదా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే జలదంకి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Strict action will be taken if illegal gambling activities

You cannot copy content of this page

Scroll to Top