దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ పొట్ట మురళి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆరోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆరోగ్య ఆసుపత్రిలో పొట్ట మురళి నీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్, బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, ముదిగొండ హరిదాస్, శ్యామ్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


