Sri Rama Shobha Yatra : మార్చి 27న శ్రీరామ శోభాయాత్ర

TRINETHRAM NEWS

పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో పోస్టర్ ఆవిష్కరణ
పుష్కర్ ఘాట్ లో బ్యానర్ ఆవిష్కరణ

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 27: మార్చి 27వ తేదీన శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ని పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో ఉత్సవ సమితి అధ్యక్షులు పతివాడ రామరాజు తదితరులు ఆవిష్కరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ దగ్గర బ్యానర్ ఆవిష్కరించారు.

ఉత్సవ సమితి కార్యదర్శి యడ్లవలి అయ్యప్ప స్వామి, గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి కోట శ్రీనివాస రావు, సోముజీ, కురగంటి సతీష్ జగదీష్ రాజ్ పురోహిత్, కర్రి శ్రీనివాస్, పి. గోపాల రెడ్డి, బొమ్ముల రవిచంద్ర, బెజ్జవరపు రవి, ప్రదీప్, లీలా శంకర్, బజరంగ్దళ్ ప్రదీప్ యాదవ్, జై కృష్ణ, గోరక్షణ సమితి దమ్ము మహేష్, సత్య, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్బంగా పతివాడ రామరాజు మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుంచి ప్రతియేటా శ్రీరామనవమి నాడు శోభాయాత్ర పెద్దఎత్తున నిర్వహించుకుంటున్నామని గుర్తుచేసారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన శ్రీరామ నవమి వేడుక సందర్బంగా శోభాయాత్రలో మరింత ఎక్కువమందిని భాగస్వాములను చేసి, విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. క్రమశిక్షణతో పురవీధుల గుండా శోభా యాత్ర సాగడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఆయన కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Rama Shobha Yatra on March 27th

You cannot copy content of this page

Scroll to Top