Internal Marks Registration : చందంపేట, దేవరకొండ మండలాలలో పదో తరగతి ఇంటర్నల్ మార్కుల నమోదు ప్రక్రియ తనిఖీ

TRINETHRAM NEWS

చందంపేట, ఫిబ్రవరి 23: త్రినేత్రం న్యూస్. చందంపేట, దేవరకొండ మండలాల పరిధిలోని వివిధ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ (అంతర్గత) మార్కుల నమోదు విధానాన్ని సోమవారం మండల విద్యాశాఖాధికారి ఇస్లావత్ గోప్యా నాయక్ నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఎంఈఓ బృందం మండలంలోని పలు విద్యాసంస్థలను సందర్శించి, రికార్డులను పరిశీలించింది.

చందంపేట జెడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తెల్దేవర్పల్లి, ల్ కేజీబీవీ చందంపేట (బాలికలు), బీసీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల దేవరకొండలో తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా విద్యార్థుల సాధన, ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో పాటిస్తున్న నిబంధనలు, మరియు ఆన్‌లైన్ ఎంట్రీ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలించారు.

మార్కుల నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా పారదర్శకంగా వ్యవహరించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సిబ్బందికి ఎంఈఓ సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల దృష్ట్యా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరారు. ఈ తనిఖీ బృందంలో ఎంఈఓతో పాటు టీమ్ సభ్యులు నాగేశ్వరరావు భూక్య, టి. వేణు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

internal marks registration process of class 10 students

You cannot copy content of this page

Scroll to Top