Trinethram News : ఈరోజు జిహెచ్ఎంసి దుండిగల్ సర్కిల్ పరిధి బౌరంపేట లోని శ్రీ దాసాంజనేయ స్వామి మరియు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలయ నాలుగవ వార్షికోత్సవం, జాతర వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై దాసాంజనేయ స్వామికి, బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. దాసాంజనేయ స్వామి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల కృపా కటాక్షాలు భక్తులపై సంపూర్ణంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బెంబడి బుచ్చిరెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


