జూన్ 26, 2026
TRINETHRAM NEWS

పాల్గొన్న దామర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణారెడ్డి త్రినేత్రం న్యూస్ / షాబాద్ ప్రతినిధి.. ఛత్రపతి శివాజీ మహారాజు ధైర్యసాహసాలు, ఆయన పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శనీయమని పొన్న చైతన్య కృష్ణారెడ్డి అన్నారు. గురువారం పొన్న చైతన్య కృష్ణారెడ్డి గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శివాజీ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దామోర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తన రాజ్యంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు కలగకుండా, స్త్రీలకు గౌరవం ఇస్తూ సుభిక్షమైన పాలన అందించిన గొప్ప పాలకుడు శివాజీ అని కొనియాడారు.

ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవడం మనందరి బాధ్యత అని, శివాజీ చరిత్ర భావి తరాలకు నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జయంతి రోజు వరకి చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని శివాజీ మహారాజుకు నీరాజనాలు అర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand 396th birth anniversary celebrations

You cannot copy content of this page