RDO warning : సచివాలయ సేవలో నిర్లక్ష్యం సహించం

TRINETHRAM NEWS

అరకులోయ ఫిబ్రవరి 20, (త్రినేత్రం న్యూస్): ప్రభుత్వ సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, సేవల నాణ్యతపై ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పాడేరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వర రావు అధికారులను ఆదేశించారు.
గురువారం డుంబ్రిగూడ అరకువేలి మండల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సచివాలయాల ద్వారా అందించే సేవల్లో పారదర్శకత, సమయపాలన తప్పనిసరి అని స్పష్టం చేశారు. సిబ్బంది ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేసినా లేదా నిర్ణీత గడువులో సేవలు అందించడంలో విఫలమైనా ప్రజలు తమకు వచ్చే ఐవీఆర్‌ఎస్ కాల్‌లో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎలెక్టర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఎన్నికల ఫారమ్‌ల డిస్పోజల్ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సేవలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో అరకువేలి, డుంబ్రిగూడ మండలాల తహసీల్దారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు మరియు ఇతర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Negligence in Secretariat Service will not be tolerated

You cannot copy content of this page

Scroll to Top