Swearing-in Ceremony : ప్రమాణ స్వీకార మహోత్సవం

TRINETHRAM NEWS

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభిమానాన్ని వమ్ము కానివ్వకుండా, మరింత బాధ్యతతో, మరింత కట్టుబాటుతో పనిచేస్తాం.

నేనావత్ బాలు నాయక్ .

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 16 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ డీ ఓ రమణా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరియు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రకమంలో పాల్గొని,మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు , వైస్ చైర్మన్ జూవేరియా తబస్సుమ్ , మరియు కౌన్సిలర్ లకు, శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పుష్పగుచ్ఛం అందజేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు , వైస్ చైర్మన్ జూవేరియా తబస్సుమ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధికి బలమైన నాయకత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు.
నూతన ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో దేవరకొండ పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డీ ఓ రమణ రెడ్డి , నూతన పాలక వర్గ సభ్యులు , కాంగ్రెస్ పార్టీ, నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swearing-in ceremony

You cannot copy content of this page

Scroll to Top