Medaram Jatara : మేడారం జాతర.. హుండీ ఆదాయం రూ.13.25 కోట్లు

TRINETHRAM NEWS

Trinethram News : Feb 12, 2026, తెలంగాణ : మేడారం మహా జాతర హుండీల లెక్కింపు బుధవారంతో ముగిసింది. ఈ నెల 5 నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన లెక్కింపులో మొత్తం 828 హుండీలను తెరిచి లెక్కించారు.

వారం రోజుల పాటు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. మొత్తం రూ.13,25,83,269 ఆదాయం లభించినట్లు వెల్లడించారు.

విదేశీ కరెన్సీ, రద్దు నోట్లు, బంగారం, వెండి ఆభరణాలు లభించాయి. గత జాతరలో 540 హుండీలతో రూ.13.25 కోట్లు రాగా, ఈసారి 828 హుండీలు పెట్టినా దాదాపు సమాన ఆదాయం రావడం గమనార్హం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Medaram Jatara.. Hundi income

You cannot copy content of this page

Scroll to Top