Bomb Threat : గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
Trinethram News : Feb 12, 2026, బెహరైన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన గల్ఫ్ ఎయిర్‌లైన్స్ 274 విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన అధికారులు పైలెట్‌కు సమాచారం అందించగా, విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
అనంతరం ప్రయాణికులను ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. బాంబ్ స్క్వాడ్, భద్రతా బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

