మాతృభూమి సేవ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
అనంతగిరి, ఫిబ్రవరి 12, (త్రినేత్రంన్యూస్): సమాజ సేవే లక్ష్యంగా మాతృభూమి సేవ సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార భోజనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి హాజరై, గర్భిణీ స్త్రీలకు స్వయంగా అన్నపానీయాలు అందజేశారు. మాతృభూమి సేవ సంఘం జిల్లా అధ్యక్షులు కరకవలస నగేష్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కరకవలస నగేష్ మాట్లాడుతూ,… “గర్భిణీ స్త్రీల ఆరోగ్యం సమాజ ఆరోగ్యానికి పునాది. సరైన పోషకాహారం అందకపోతే తల్లి, శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల గర్భిణీ స్త్రీలకు కనీసం ఒకపూట పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం,” అని తెలిపారు.
ముఖ్య అతిథి సిహెచ్ మురళి మాట్లాడుతూ,… “సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మాతృభూమి సేవ సంఘం చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన తరాలు రూపుదిద్దుకుంటాయి,” అని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు స్వయంగా భోజనం వడ్డించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల జనసైనికులు… పాంగి లక్ష్మణ్, సాగర మధు, పాంగి చిన్న, కిలో బొంజుబాబు, సోమల దేవదాస్ తదితరులు పాల్గొని భోజనాల పంపిణీకి సహకరించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కూడా కల్పించారు.
అనంతగిరి పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలకు తోడ్పాటుగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
భోజనాల పంపిణీ అనంతరం గర్భిణీ స్త్రీలు మాతృభూమి సేవ సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆరోగ్యం పట్ల చూపుతున్న శ్రద్ధకు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరారు.
సేవాభావంతో సాగిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది. మాతృభూమి సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


