అమరావతి : అమరావతి, ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారత్‌కు కూడా ఇదొక చారిత్రాత్మక దినం…. ఇవాళ క్వాంటం వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయటం లేదు..గ్లోబల్ క్వాంటం రెవల్యూషన్‌లో భాగమయ్యే నిపుణులకు కూడా పునాది వేసుకుంటున్నాం… ఐక్య రాజ్యసమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది.
ఇది క్వాంటం ట్రాన్సిషన్ మూమెంట్ గా నిలిచిపోతుందని భావిస్తున్నాను… ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్ధ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ ఓ కీలకమైన ముందడుగు అవుతుంది. గతంలో వచ్చిన వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందిపుచ్చు కోలేకపోయింది. కానీ ఐటీ విప్లవంలో మనం ముందడుగు వేశాం … గతంలో హైదరాబాద్ లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. అది ఓ గేమ్ చేంజర్ గా మారి ఫలితాలను ఇస్తోంది.
హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాం.. భారత్ లో ఏర్పాటు చేస్తున్న తొలి అమరావతి క్వాంటం వ్యాలీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఇది కూడా ఓ విప్లవంగా మారుతుంది. సాంకేతిక విప్లవాన్ని ఆచరించే ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీఎస్ఎన్‌ఎల్ 4 స్టాగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సాంకేతికత ద్వారా 6 జీ కమ్యూనికేషన్ కూడా సాధ్యం అవుతుంది. ఇదే తరహాలో భారత్ నుంచి వేర్వేరు ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలని ఆకాంక్షిస్తున్నాను… గతంలో ఐటీ గురించి, సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే నన్ను విమర్శించిన వారి పిల్లలు అంతా ఐటీ రంగంలో అమెరికాలో స్థిరపడ్డారు… వచ్చే 30 -40 ఏళ్లలో ఆచరణలోకి వచ్చే అంశాలపై నేనెప్పుడూ ఆలోచన చేస్తాను. దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉంటాయి
టెక్నాలజీని అందిప్చుచ్చుకున్న దేశమే భవిష్యత్తులో అభివృద్ధి సాధించగలుగుతుంది… క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కేంద్రంగా ఏపీ మారుతుంది… క్వాంటం డిజైన్స్, క్వాంటం ఉత్పత్తులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్‌కు అమరావతి కేంద్రం అవుతుంది.
డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ , ఫైనాన్స్, క్లైమాట్ మోడలింగ్ కు అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయి. ఇప్పటి వరకూ అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారు..ఇక నుంచి అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తున్నాం
దీనికి ఇక్కడున్న రైతులే ప్రధాన భాగస్వాములు. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా అమరావతి తయారవుతుంది.. ప్రపంచశ్రేణి క్వాంటం టెక్నాలజీ నగరంగా అమరావతి మారుతుంది. భారత్ లోని మొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


