Modi thanks Trump : ట్రంప్ కు ధన్యవాదాలు చెప్పిన మోదీ.. గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్

TRINETHRAM NEWS

ట్రేడ్ డీల్ పై ఇరు దేశాల సంయుక్త ప్రకటనను స్వాగతించిన ప్రధాని
ఇరు దేశాలకూ ప్రయోజనమని వ్యాఖ్య
మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి
Trinethram News : భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ పై ఇరుదేశాల ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మధ్యంతర ఒప్పందం ఖరారు కావడం వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ‘గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా, అమెరికా’ అని ట్వీట్ చేస్తూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పారు.

ట్వీట్ ఇదే..
‘‘భారత్‌, అమెరికాల మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్ కు ఫ్రేమ్ వర్క్ ఖరారు చేశాం. ఇది అమెరికా, భారత్.. రెండు దేశాలకూ శుభవార్త. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పేందుకు నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్‌ కు కృతజ్ఞతలు. ఈ ఒప్పందం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారత్‌ లోని రైతులు, స్టార్టప్‌ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Modi thanks Trump, tweets,

You cannot copy content of this page

Scroll to Top