‘Lakshapati Didi’ : శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ‘లక్షపతి దీదీ’ సమ్మేళనo

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమురు: జై కా సంస్థ సహకారంతో శ్రీజ కంపెనీ ఆధ్వర్యంలో పెనుమురు పాల శీతలీకరణ పరిధిలో శుక్రవారం లక్పతి దీదీ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాల బిల్లుల రూపంలో లక్ష రూపాయల పైగా ఆదాయం పొందుతున్న శ్రీజ మహిళా యజమానులను ఆహ్వానించి లక్పతి దీదీ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ లక్పతి దీదీ సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి జీడి నెల్లూరు ఏరియా ఆఫీసర్ మునికృష్ణ మాట్లాడుతూ ప్రతి శ్రీజ మహిళా పాడి పరిశ్రమలో లక్షాధికారులుగా అభివృద్ధి చెందాలని వాటికి అనుగుణంగా ఆవుల పెంపకం పాల ఉత్పత్తిని అభివృద్ధి చేసుకోవాలని శ్రీజ మహిళా యజమానులకు తెలియజేశారు. శ్రీజ సంస్థ కుప్పం ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో శ్రీజ సంస్థ సొంతగా శ్రీజ క్యాటిల్ ఫీడ్, పౌడర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

మహిళల అభివృద్ధి శ్రీజ సంస్థ కృషి చేస్తుందని మరియు ఇండియన్ బ్యాంక్ ద్వారా సభ్యులకు కల్పిస్తున్న క్యాటిల్ లోన్స్, మదర్ డైరీ సహకారంతో తోతాపూరి మామిడి పండ్లు, బేబీ కార్న్ పంటలను నాణ్యత ఆధారంగా సేకరిస్తామని అన్నారు. దీని ద్వారా శ్రీజ మహిళా
యజమానులకు అదనంగా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. పిఐబి ఎగ్జిక్యూటివ్ మురళి శ్రీజ మహిళా యజమానులతో మాట్లాడుతూ పశు సంరక్షణలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలి పారు. పాల నాణ్యత పెరుగుదల దిశగా అడుగులు వేయాలని ఆవులకు శ్రీజ పశువుల దాణా.

మినరల్ మిక్చర్, తప్పకుండా వాడాలని చెప్పారు. ప్రస్తుతం పాడి పరిశ్రమలో పశువుల పెంపకం కోసం సాంకేతిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. శ్రీజ మహిళా యజమానుల ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇండియన్ బ్యాంక్ సహకారంతో పశువుల కొనుగోలుకు, మిల్కింగ్ మిషన్స్, చాప్ కట్టర్స్ మరియు పశువుల షెడ్స్ అభివృద్ధి కొరకు రుణాలు ఇవ్వనున్నట్లు ఇండియన్ బ్యాంక్ అధికారులు తెలిపారు.

లక్పతి దీదీ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన వారికి ఎగ్జిక్యూటివ్ బాగ్స్ తో పాటు ఆర్.జి.ఎం ప్రాజెక్ట్ ద్వారా మినరల్ మిక్చర్ ట్రైసోమిక్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పెనుమూరు సూపర్వైజర్ మహేష్, శ్రీజ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తాయారమ్మ, ఇండియన్ బ్యాంక్ అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ నరసింహ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

‘Lakshapati Didi’ gathering

You cannot copy content of this page

Scroll to Top