వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.
Trinethram News : ఇటీవల టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.
ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు.
మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ కార్యాలయం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మార్గాల మీదుగా సిద్దార్ధనగర్లో ఉన్న అంబటి రాంబాబు నివాసానికి 11 గంటలకు చేరుకుంటారు.
అక్కడ అంబటి కుటుంబ సభ్యులను కలిసి సంఘటనపై ఆరా తీసి వారికి ధైర్యం చెబుతారు. పరామర్శ అనంతరం మధ్యాహ్నం గుజ్జనగుండ్ల, స్తంభాల గరువు, కలెక్టర్ కార్యాలయం, చుట్టుగుంట, కేవీపీ (వీఐపీ) రోడ్, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కాకాణి, మంగళగిరి మార్గాల మీదుగా తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రే ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో
గుంటూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


