Telangana Municipal Elections : తెలంగాణ పురపోరు.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3న లాస్ట్ ఛాన్స్

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, తెలంగాణ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం(Feb 3న) ముగియనుంది.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 2,996 వార్డులకుగాను 20,313 మంది 29,694 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఈ మేరకు పరిశీలన అనంతరం 19,608 నామినేషన్లు అర్హత సాధించాయని అధికారులు తెలిపారు.

అయితే మంగళవారం మ. 3గం. వరకు పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది లిస్టును ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Municipal Elections

You cannot copy content of this page

Scroll to Top