High Court : గ్రూప్‌-1 అవకతవకలపై పిటిషనర్‌కు బెదిరింపులు వస్తున్నాయా: హైకోర్టు

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలపై పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తికి బెదిరింపులు వస్తున్నాయా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషనర్‌కు రక్షణ కల్పించే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

2023లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో అవకతవకలపై పిటిషన్‌ దాఖలు చేయడంతో పరీక్షలు రద్దయిన నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని బీ నర్సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, వివరణ ఇవ్వడానికి గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Are threats being made against the petitioner

You cannot copy content of this page

Scroll to Top