శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ జనవరి 30 త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
శుక్రవారం కొండమల్లెపల్లి మండలం చెన్నారం గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి జాతర ఈసందర్భంగా మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు.
దైవచింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు,సర్పంచ్ రమావత్ తులసిరామ్, దామోదర్ రెడ్డి, ఉప సర్పంచ్ కిషన్, ఏర్పుల జనార్దన్,జబ్బర్, అంజి, కృష్ణ రెడ్డి,హరీష్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


