ఏలూరు జిల్లా : జనవరి : ముప్పై : (త్రినేత్రం న్యూస్); రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జరిగిన రాష్ట్రస్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఈ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ , దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. పంటను మరింత విస్తరణంలో పెంచేందుకు సంబంధిత రైతులకు ప్రోత్సాహం అందించడం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తి, సాగు, మెలుకువలు మార్కెటింగ్ సౌకర్యాలపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అని వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


