Minister : కల్తీ నెయ్యి వ్యవహారంపై ఖండించిన మంత్రి.

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : జనవరి :ఇరవై తొమ్మిది : (త్రినేత్రం న్యూస్); తిరుపతి జిల్లా, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదం తయారీలో గత ప్రభుత్వంలో నెయ్యి కల్తీ జరిగిందని వినియోగించిన ఘటనకు నిరసనగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణం, పౌర సంబంధాల శాఖ కొలుసు. పార్థసారథి పాల్గొన్నారు .

ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలో బస్సు ప్రాంగణం వద్ద నుంచి వెంకటాచల స్వామి ఆలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రత్యేక పూజలు చేశారు. మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హాయంలో తిరుమల లడ్డు తయారీలో అర వై ఎనిమిది. ఒకటి ఏడు లక్షల కిలోల మేరకు కల్తీ నెయ్యిని వినియోగించిన మహా దుర్ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. అది అసలు నెయ్యి కాకుండా పామాయిల్ రసాయనాలు కలిపిన ద్రవం, జంతువుల కొవ్వుతో తయారైన సింథటిక్ నెయ్యి అని తెలిపారు.

ఈ కల్తీ నెయ్యితోనే సుమారు ఇరవై కోట్లు లడ్డు ప్రసాదాలు తయారు చేసినట్లు తగిన ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రూపాయలు రెండు వందల యాభై ఒక్క కోట్ల మేర అక్రమ లాభాలు, వైసిపి పెద్దలు తమ జేబుల్లో వేసుకున్నారని మంత్రి విమర్శించారు. తిరుమల లడ్డు లాంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ చేయడం హిందూ ధర్మానికి, కోట్లాది భక్తుల విశ్వాసానికి ఘోర అవమానమని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister condemns adulterated ghee affair

You cannot copy content of this page

Scroll to Top