Baburam Naik : రాష్ట్ర సమాచార కమిషనర్‌ను కలిసిన బాబురామ్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 29 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్( దేశాలభూపాల్)ను “సమాచార హక్కు సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ను శాలువా , పుష్ప గుచ్చం తో ఘనంగాసన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా బాబురామ్ నాయక్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ( ఆర్ టి ఐ యాక్ట్ ) ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్నిపెంచడానికి తమ సొసైటీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

సామాన్య ప్రజలకు చట్టం పట్ల అవగాహన కల్పించడంలో కమిషన్ అందిస్తున్నసహకారం గొప్పదన్నారు. రాబోయే రోజుల్లో సమాచార హక్కు చట్టాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజలకు సత్వరన్యాయం జరిగేలా చూడాలని ఆయన కమిషనర్ ను కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Baburam Naik meets the State Information Commissioner

You cannot copy content of this page

Scroll to Top