Collector A.S. Dinesh Kumar : నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

TRINETHRAM NEWS

జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్

అరకులోయ జనవరి 30, (త్రినేత్రంన్యూస్): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన నేపథ్యంలో, నేడు జనవరి 30వ తేదీ (శుక్రవారం) నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి శుక్రవారం పాడేరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) సమావేశ మందిరంలో నిర్వహించే ఈ వేదిక, ఉపముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల నేపథ్యంలో ఈ వారం నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
దూర ప్రాంతాల నుంచి ప్రజలు వినతులు సమర్పించేందుకు రావద్దని, దీనిని గమనించాలని ఆయన కోరారు. కాగా, రానున్న శుక్రవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Public Issues Resolution Forum Cancelled Today

You cannot copy content of this page

Scroll to Top