Veterinary Health Camps : గిరిజన గ్రామాల్లో పశువైద్య ఆరోగ్య శిబిరాలు

TRINETHRAM NEWS

అరకులోయ, జనవరి 29, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలోని గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో పశు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులకు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నారు.
బుధవారం బస్కి పంచాయతీ పరిధిలోని దేవరపల్లి గ్రామం, మాడగడ పంచాయతీ పరిధిలోని బోడుగుడ గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు అందజేశారు. వైసీపీ కిలో రామన్న రైతులకు మందులు పంపిణీ చేశారు.
శిబిరాల్లో భాగంగా పశువులకు నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు వేయడంతో పాటు పశు బీమా పథకం, పశుకి సన్ క్రెడిట్ కార్డు, నాణ్యమైన ఇన్‌పుట్ సబ్సిడీ సరఫరా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలు గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఈ శిబిరాల్లో వైద్యాధికారి సీనయ్య, పశు వైద్య సిబ్బంది సంజీవ్, కృష్ణ, అనంత్ రావు, రత్నం, రాంలాల్, మహేష్, అంబులెన్స్ పైలెట్ సల్మాన్, పెరవేట్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Veterinary health camps in tribal villages

You cannot copy content of this page

Scroll to Top