77th Republic Day : ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం నందు 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు.

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నందు 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా మహిళా, పురుష పెన్షనర్లకు ఆటల పోటీలు ఆటల కమిటీ పెద్దలు మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, కంచర్ల నారాయణ రెడ్డి, పంగునూరు లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.జాతీయ పతా
కం ఆవిష్కరణ అనంతరం అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన సమావేశం జరిగినది. కార్యదర్శి అంకం చంద్రమౌళి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్, మహిళా ఉపాధ్యక్షురాలు పడమటి శాంతకుమారి,జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మా పెన్షనర్స్ ఆటల పోటీలలో, పాటల పోటీలలో చాలా ఉత్సహంగా పాలుగోన్నారని అన్నారు, అనంతరం ఫ్యామిలీ పెన్షనర్ అజుబా అందరికి స్వీట్స్ అందజేసినారు.

సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య మాట్లాడుతూ హాజరైన మిత్రులకు, ఆటల పోటీలలో పాలుగొన్న మహిళా క్రీడామణులకు, పురుషులకు, గెలుపొందిన వారికి, స్వీట్ దాతకు, కార్యక్రమం విజవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేసినారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

77th Republic Day celebrations at Government Pensioners'

You cannot copy content of this page

Scroll to Top