ZPHS : డిండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన( డయాస్) స్టేజి ప్రారంభం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జనవరి 26, నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని, డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించిన ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థు ల దాతృత్వంతో సుమారు లక్ష రూపాయలు వెచ్చించి, నిర్మాణం చేసిన డయాస్( స్టేజి) నీ రిపబ్లిక్ దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని, సోమవారం ప్రారంభించుకున్నారు.

ఈ ప్రారంభ కార్యక్రమం పూర్వ ఉపాధ్యాయుడు వంగాల శేఖర్ రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం తిరుపతయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. 1988- 89 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎలకుర్తి మల్లేష్ ,కాసం శ్రీనివాసులు, తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, నల్లగంతుల బాలయ్య, షేక్ ఇస్మాయిల్ ,తదితరులు పాల్గొన్నారు. దాతలకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేసి, దాతలను ఘనంగా సన్మానించారు.

తదుపరి కార్యక్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించిన క్రీడలలో విజేతలైన విద్యార్థులకు స్థానిక సర్పంచ్ నల్లగంతులరవిచేతులమీదుగాబహుమతులనుఅందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితోపాటు, పూర్వ విద్యార్థులు ,నవశక్తి యువజన సంఘం సభ్యులు ,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The newly constructed (DIAS) stage was inaugurated

You cannot copy content of this page

Scroll to Top