77th Republic Day : ఆర్.ఎస్.ఆర్, ఇంటర్నేషనల్ పాఠశాల యందు 77వ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 26: నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గం:గౌరవరం.. ఆర్. ఎస్. ఆర్, ఇంటర్నేషనల్ పాఠశాల నందు 77వ భారతదేశ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ మండల విద్యాశాఖ అధికారి K .శ్రీధర్ రావు , DR . లక్ష్మీధర్ రెడ్డి , P L కాంతారావు ,విచ్చేసి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు స్వాతంత్రోద్యమ నాయకుల వేషధారణలో అలరించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యా వికాస సేవా సమితి , నిర్వహించిన రామాయణ పోటీలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు Ch . సౌమిత్(ప్రథమ బహుమతి), D. నిహారిక (ద్వితీయ బహుమతి),P. లిఖిల (తృతీయ బహుమతి) విద్యార్థులకు P. కోటేశ్వరరావు , (విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సెక్రెటరీ) I. రమణయ్య (విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి) ,విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు 77వ గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను వివరించారు. పాఠశాల చైర్మన్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , కరస్పాండెంట్ రామిరెడ్డి ఆదిలక్ష్మి , మేనేజ్మెంట్ ట్రస్టీ రమణారెడ్డి , విద్యార్థులకు ఉపాధ్యాయులకు, అధ్యాపకేతర సిబ్బందికి 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

77th Republic Day celebrations at R.S.R. International School

You cannot copy content of this page

Scroll to Top