Trinethram News : అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు చేపట్టారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో గవర్నర్ 11 దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


