Telangana Municipal Elections : తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు: ఇన్చార్జిల నియామకం – హుస్నాబాద్ మున్సిపల్ ఇన్చార్జిగా తక్కెళ్లపల్లి రవీందర్ రావు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలు (ఇన్చార్జిలు) నియమిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం, హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ని నియమించారు.

పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, ఎన్నికల వ్యూహాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగాయని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Municipal Elections

You cannot copy content of this page

Scroll to Top