KTR’s Direct Question to SIT : సిట్ అధికారులకు కేటీఆర్ సూటి ప్రశ్న

TRINETHRAM NEWS

Trinethram News : తాను గాని, తమ నాయకులు గాని విచారణకు హాజరవుతున్న సమయంలో బయటకు తప్పుడు సమాచారం ఎలా వెళ్తోంది? ఎవరి అనుమతితో ఇష్టంవచ్చిన లీకులు ఇస్తున్నారు?” అంటూ పోలీసు అధికారులను ప్రశ్నించిన కేటీఆర్.

విచారణ గదిలో జరగని విషయాలు కూడా మీడియా స్టూడియోలకు చేరుతున్నాయంటే, ఇది వ్యవస్థ వైఫల్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రనా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

సిట్ విచారణ అంటే చట్టబద్ధ ప్రక్రియ… ఇలాంటి చీప్ లీకులు అంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఈ తప్పుడు లీకులు ఆపాలి… రాజకీయ ప్రతీకారం కోసం ఇలాంటి చర్యలు తలపెడితే ప్రజలు తగిన సమాధానం చెబుతారు, పోలీసులు ప్రభుత్వానికి కాదు, రాజ్యాంగానికి విధేయులని గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ అధికారులకు చెప్పినట్టు సమాచారం…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KTR's direct question to SIT officials

You cannot copy content of this page

Scroll to Top