ఏలూరు జిల్లా : జనవరి 23: (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం గ్రామంలో నూతనంగా నూటముప్పై రెండు / ముప్పై మూడు కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ట్రాన్స్ కో ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార మరియు ప్రజా సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చింతలపూడి , నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, డైనమిక్ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల చైర్ పర్సన్ ఘంటా . పద్మశ్రీ, నూజివీడు సబ్ కలెక్టర్ ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్స మట్ల. ధర్మరాజు ఘనంగా ప్రారంభించారు .
గోపాలపురం ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది.అర వై కోట్లు విద్యుత్ ఉప కేంద్రానికి ఖర్చు అయినట్లు సంబంధిత శాఖ మంత్రి తెలిపారు. ఆ ప్రాంగణంలో మామిడి మొక్కలు నాటారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించి సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వినపత్రాలు తీసుకుని పరిశీలించి తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అందించామని పేర్కొన్నారు. రాష్ట్రం మరియు దేశంలో రామరాజ్య పరిపాలన , అనగా ప్రజా పాలన జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


