Akshay Kumar : హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌ వాహనానికి సోమవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. అక్షయ్ కుమార్‌, ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తుండగా…

కాన్వాయ్ లోని ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినగా, ఆటో డ్రైవర్‌తో పాటు ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి.

అక్షయ్, ట్వింకిల్‌ ప్రయాణిస్తున్న కారుకి స్వల్పంగా దెబ్బ తగిలినప్పటికీ.. వారిద్దరూ సురక్షితంగా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదానికి కారంణం ముంబై జుహూ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఒక మెర్సిడెస్‌ కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.

ఆ ఆటో అదుపు తప్పి రోడ్డుకు అవతలివైపు ప్రయాణిస్తున్న అక్షయ్ ఎస్కార్ట్‌ కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hero Akshay Kumar's car met with an accident..

You cannot copy content of this page

Scroll to Top