Trinethram News : Jan 19, 2026, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పోలండ్ ఉప ప్రధాని రాడోస్లావ్ సికోర్క్సీతో ఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, గతేడాది అక్టోబర్‌లో పాక్ పర్యటనలో జమ్మూకశ్మీర్‌పై సికోర్క్సీ చేసిన సూచనలను జైశంకర్ ప్రస్తావించి, ఉగ్రవాదంపై కఠిన వైఖరి తీసుకోవాలని సూచించారు.
భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని, స్నేహాన్ని కోరుకునే దేశాలు ఉగ్రవాదంపై మెతక వైఖరి వీడాలని అన్నారు. దానిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలే గానీ సరిహద్దుల్లో ఉగ్రవాదానికి ఆజ్యం పోయకూడదని చురకలు అంటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


