Municipal Election : ఒకే దఫాలో ఎన్నికలు!

TRINETHRAM NEWS

ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు

Trinethram News : తెలంగాణలో ఏడు .. నగర పాలక సంస్థలు, 116 పురపాలికల ఎన్ని కల షెడ్యూలు జారీకి రంగం సిద్ధమయింది. మంత్రిమండలి ఆమోదం తెలపడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకటి, రెండురోజుల్లో షెడ్యూ లును విడుదల చేసేందుకు సమాయత్తమవు తోంది. ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దస్త్రం సోమవారం ఎన్నికల సంఘానికి చేరుతుంది.

దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం సమావేశమై షెడ్యూలును విడుదల చేస్తుంది. ఇప్పటికే మహబూబ్నగర్, కరీంనగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామ గుండం, నల్గొండ, నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు 116 పురపాలికల్లో ఓటర్ల జాబి తాలు, పోలింగు కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్ లు సిద్ధమయ్యాయి.

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవగా వాటిపై గెజిట్లు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రం లోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 15 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగు తర్వాత రెండు రోజు లకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడయినా అవాంఛనీయ సంఘటనలు జరిగి ఎన్నికలకు ఆటంకం కలిగితే మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

ఆ తర్వాత రోజు అధికారులు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితా లను ప్రకటిస్తారు. దీని తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలకునోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికయిన కార్పొరేటర్లతో మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు కౌన్సిలర్లతో ఛైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Elections in one phase

You cannot copy content of this page

Scroll to Top