Makara Jyoti Darshan : శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దర్శనం

TRINETHRAM NEWS

Trinethram News : కేరళ : కేరళలోని శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎదురుచూసే మకరజ్యోతి దర్శనం ఘనంగా జరిగింది.

సాయంత్రం పొన్నంబలమేడుపై మకరజ్యోతి వెలుగులు స్పష్టంగా దర్శనమిచ్చాయి. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు.
ఈ సందర్భంగా మూడుసార్లు మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో శబరిమల కొండలు “స్వామియే శరణం అయ్యప్ప” నామస్మరణతో మార్మోగాయి. భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Makara Jyoti Darshan for Devotees in Sabarimala

You cannot copy content of this page

Scroll to Top