ఆర్గనైసేడ్ బై దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్.
దేవరకొండ డివిజన్ జనవరి 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ జిల్లా పరిషత్ (బాలుర )హై స్కూల్ గ్రౌండ్ లో వారం రోజులపాటు నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా ముగిసినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ , సతీమణి జ్యోతి ప్రసన్న,స్పాన్సర్వ్డ్ బై అభిలాష్ నాయక్ పాల్గొన్నారు.
గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేసి అభినందనలు తెలియజేసినారు. అనంతరం శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ దేవరకొండలో ఇండోర్ అవుట్ డోర్ స్టేడియాలు అందుబాటులోకి వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తానని క్రీడాకారులకు భరోసా కల్పించారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కిడాకారులను ప్రోత్సహించడం కోసం ఇలాంటి టోర్నమెంటులు పెద్ద ఎత్తున నిర్వహించడానికి దోహదపడుతుందని అన్నారు.
క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని క్రీడల అభివృద్ధికై నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ ని విజయవంతం చేసినందుకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులని అభినందిస్తూ అధ్యక్షుడు ఎన్ వీ టీ ప్రత్యేకంగా అభినందించాడు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎన్ వీ టీ శ్రీధర్ గౌడ్, రాపోలు నిరంజన్, శేఖర్,సన్నీ, శరత్,లీట్టు, యూనుస్ రాoసింగ్ నాయక్ సందీప్,పెద్దిరాజు, ఈశ్వర్, మోసిన్ , వెంకటేష్, నవీన్,మహేష్, వివిఆర్, బుడిగ వేంకటేష్ వల్లమాల ఆంజనేయులు. తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


