యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి
అనంతగిరి, జనవరి 13, (త్రినేత్రంన్యూస్): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల కేంద్రానికి సమీపంలోని పెద్దూరు గ్రామంలో ఎగువశోభ, అనంతగిరి పంచాయతీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చిట్టం మురళి, ఎగువశోభ సర్పంచ్ కొర్రా సింహాద్రి, అనంతగిరి సూపర్ సర్పంచ్ సోమేల నాగులు కలిసి ప్రారంభించారు.
పోటీల ప్రారంభంతో మైదానం క్రీడాభిమానులతో కిటకిటలాడింది. యువకులు పెద్ద సంఖ్యలో హాజరై మ్యాచ్‌లను ఆసక్తిగా తిలకించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి పోటీల నిర్వహణ అభినందనీయమని పలువురు ప్రశంసించారు.
ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చిట్టం మురళి మాట్లాడుతూ, నేటి యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగగలమని పేర్కొన్నారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా గిరిజన యువత సత్తా చాటగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, సహనం, జట్టు భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి యువకుడు క్రీడలను తన జీవితంలో ఒక భాగంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎగువశోభ పంచాయతీ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్, టీడీపీ యువ నాయకుడు మోష్య రంజిత్, లక్ష్మణ్ రావు, పిసా ఉపాధ్యక్షుడు డి. దోనేష్, డా. రామకృష్ణతో పాటు పోటీల నిర్వాహకులు మోష్య, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ పోటీల నిర్వహణతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, యువత ఉత్సాహంగా పాల్గొంటూ తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


