AITUC : ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనం రూపాయలు 26,000 తక్షణమే చెల్లించాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి యూసఫ్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ వరంగల్ ప్రతినిధి.. వరంగల్ శివనగర్లోని సీపీఐ పార్టీ (తామర భవన్) కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ..

నేషనల్ హెల్త్ మిషన్లో లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు కనీస వేతనం రూపాయలు 26000 తక్షణమే చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు అలాగే నాలుగో తరగతి ఉద్యోగులకు గత నాలుగు నెలల వేతనాలు సెప్టెంబర్ ,అక్టోబర్, నవంబర్, మరియు డిసెంబర్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో కోటి కమిషనర్ కార్యాలయం ముందు ఉద్యోగులు అందరితో కలిసి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.నరసింహ మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హసీనా బేగం, జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ (ఏఐటీయూసీ అనుబంధం) ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు, ఏఐటియుసి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ , జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డీ. స్వప్న మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AITUC State President M.D. Yousuf has demanded

You cannot copy content of this page

Scroll to Top