National Jump Rope Champions : జాతీయ స్థాయిలో జంప్ రోప్ ఛాంపియన్లుగా తెలంగాణ క్రీడాకారులు

TRINETHRAM NEWS

కూకట్‌పల్లి జనవరి 10 (త్రినేత్రం న్యూస్) : చెన్నైలో జరిగిన 22వ సబ్-జూనియర్ నేషనల్ జంప్ రోప్ ఛాంపియన్‌షిప్, 20వ ఫెడరేషన్ కప్ పోటీలలో తెలంగాణ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రికార్డు స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు.

తెలంగాణ జంప్ రోప్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మేసా రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణ మార్గదర్శకత్వంలో తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. 14 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 12 కాంస్య పతకాలతో మొత్తం 34 పథకాలు సాధించారు.

కఠోర శ్రమ క్రమశిక్షణతో తెలంగాణ పేరును జాతీయ వేదికపై నిలబెట్టిన యువ ఛాంపియన్లందరిని తెలంగాణ జంప్ రోప్ అసోసియేషన్ (టీ.జే.ఆర్.ఏ) జనరల్ సెక్రటరీ మేసా రాజేంద్రప్రసాద్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana players emerge as national jump rope champions

You cannot copy content of this page

Scroll to Top