టిడ్కో ఆద్వర్యంలో…..
మన ఇళ్ళు…
మన సంక్రాంతి….
త్రినేత్రం న్యూస్, మండపేట, ప్రతి ఒక్కరు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ ను నిర్వహించుకోవాలని పుర పాలక చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. గొల్లపుంత ఏపి టిడ్కో ఆధ్వర్యంలో టిడ్కో అపార్ట్మెంట్ వద్ద గురువారం మన ఇళ్ళు మన సంక్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ అనేక ఆటల పోటీలు నిర్వహించారు. భోగిమంటలు, పిండివంటలు మొదలైనవి ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు ఈ పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లా లో సంక్రాంతి సందడి చూసి తీరాల్సిందే అని పేర్కొన్నారు.
అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ టిడిపి అధ్యక్షులుమచ్చా నాగు, టౌన్ టిడిపి మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మెకానిక్ కరీం , బిజెపి వార్డు ఇంచార్జ్ ప్రసాద్, టిడిపి నాయకులు నరగిరి బాపయ్య, టిడ్కోఇ ఇ గంగరాజు కమిషనర్ టివి రంగారావు, టి పి ఓ శ్రీ రమ్య, ఏ ఇ వివేక్, సి ఎల్ టి సి బిందు, మెప్మా సిబ్బంది, టిడ్కో లబ్ధిదారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


