త్రినేత్రం న్యూస్, గత నెల 31వ తేదీన విగ్నేశ్వర థియేటర్ సమీపన విద్యుత్ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రవీణ్ సప్లయర్స్ లో పనిచేస్తున్న సామర్లకోట మండలం వికె రాయపురం గ్రామానికి చెందిన రాజు గాయపడిన విషయం విదితమే.
కాగా బాధిత కుటుంబానికి సప్లయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సహాయాన్ని అందించారు. యూనియన్ నేతలు బాధించు కుటుంబాన్ని స్వయంగా కలిసి 25వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని,నిత్యవసర సరుకులు అందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని యూనియన్ నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా సప్లయర్స్ యూనియన్ అధ్యక్షులు సిరి శ్రీనివాస్, తిరుమల టెంట్ హౌస్ భాస్కర్, సామర్లకోట మండల సప్లయర్స్ యూనియన్ అధ్యక్షులు మంచెం సాయిబాబు,పిల్లాడి రంగబాబు,తిరుమలశెట్టి బుజ్జి,మేకా శ్రీను,నమ్మి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


