పార్కుల వేతనాల బిల్లులు తక్షణమే చెల్లించండి….
త్రినేత్రం న్యూస్ , కాకినాడ,జనవరి,08: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పార్కుల కూలీలకు, కాకినాడ స్పెషల్ సానిటేషన్, టాయిలెట్ కార్మికులకు బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుళాయి చెరువు పార్కు, గాంధీనగర్ పార్కుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు సంక్రాంతి పండగ జరుపుకుంటాం బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని ప్రసాద్ అన్నారు.
పార్కు కూలీలకు రెండు నెలలుగా జీతాలు మంజూరు చేయడం లేదని, చాలీచాలని జీతాలతో అర్థ ఆకలితో పనిచేస్తున్నారని సంక్రాంతి పండగ పూట వస్తువులు ఉండే పరిస్థితి వస్తుందని,బకాయి జీతాలు తక్షణమే చెల్లించి కార్మికుల సంక్రాంతి పండగలు జరుపుకునేందుకు సహకరించాలని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ 9 నెలల బకాయి వేతనాల బిల్లులను కార్పొరేషన్ అధికారులు తక్షణమే చెల్లించాలని, బిల్లులు సకాలంలో చెల్లిస్తే కార్మికులకు జీతాలు మంజూరు అవుతాయని సంక్రాంతి లోపు చెల్లించాలని ఆయన అన్నారు.
కాకినాడ స్పెషల్ సానిటేషన్, టాయిలెట్ కార్మికుల 3 నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, సంక్రాంతి లోపు బకాయి వేతనాలు చెల్లించి స్వీట్ కబురు అందించాలని, సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సహకరించాలని ఆయన అన్నారు.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి సంవత్సరం రెండు జతలు కాకి యూనిఫామ్ లు,మహిళలకు రెండు చీరలు, జాకెట్ ముక్కలు, చెప్పులు, కొబ్బరి నూనెలు, టవల్స్, సబ్బులు ప్రతీ సంవత్సరం సంక్రాంతిలో పండక్కి అందజేస్తారని కానీ ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు ఏ ఒక్కటి మంజూరు చేయలేదని, సంక్రాంతి పండగలంటూ విధుల్లో ముగ్గులు వేస్తూ కొట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగిస్తున్నారని, కార్మికులకు రావాల్సిన రాయితీలో బకాయి జీతాలు చెల్లించడం లేదని వారు ఉసురు తగులుతుందని ఆయన అన్నారు.
ఈ పండగకు చంద్రన్న కానుకలు అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయి జీతాలు తక్షణ చెల్లించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, రామలక్ష్మి, కుమారి, లతా తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


